
మాట్లాడుతున్న పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జీఎంఆర్
కొత్తకోట: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్‌ఎస్‌పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోందని.. వారికివే వీడ్కోలు సమావేశాలని పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రావు ఎద్దేవా చేశారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తకోటకు 30 పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు తీసుకొస్తానని ఎమ్మెల్యే ఆల హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. 2014లో ఆయన ఆస్తులు.. ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు పల్లెపాగు ప్రశాంత్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణావర్ధన్‌రెడ్డి, గొల్ల బాబాన్న, మాజీ సర్పంచ్ బాలస్వామి, మేసీ్త్ర శ్రీనివాసులు, బోయేజ్, కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, బీచుపల్లియాదవ్, సలీంఖాన్, సాయన్నగౌడ్, బాలరాజు, బంగారయ్య, గుంత రమణ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి