
● ప్రైవేట్ కోచింగ్ సెంటర్లదందా
● గురుకుల సీట్ల కోసం దొంగ సర్టిఫికెట్ల సృష్టి
● వనపర్తి జిల్లాకేంద్రంగారెచ్చిపోతున్న మాఫియా
● విద్యాశాఖ అధికారులతోనిర్వాహకుల కుమ్మక్కు
● ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల వరకు అదనంగా వసూళ్లు
● ‘స్థానికత’ కోల్పోతున్నవిద్యార్థులు
ఇలా వెలుగులోకి..అయినా చర్యలు శూన్యం
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులోని మండల పరిషత్ హైస్కూల్‌లో నాలుగో తరగతికి చెందిన ఒకరు, ఐదో తరగతికి చెందిన ఇద్దరు, ఆరో తరగతికి చెందిన ఒక విద్యార్థి ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేయకుండానే 2022–23లో పెబ్బేరులోని సరస్వతి విద్యానికేతన్, శ్రీవిజ్ఞాన్ హైస్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. వారికి ఎంఈఓ లాగిన్‌లో ఆన్‌లైన్ డేటాకు పర్మిషన్ ఇచ్చారు. పసిగట్టిన ఆ స్కూల్ హెచ్‌ఎం ఈ సమాచారాన్ని గద్వాల డీఈఓకు అందించగా.. ఆయన వనపర్తి డీఈఓ రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు విద్యాసంవత్సరంలో ఆయా పాఠశాలల్లో చదివినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.