ముగిసిన ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ బ్యాచ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ ఉచిత శిక్షణ మంగళవారంతో ముగిసింది. శిక్షణార్థులకు ఆర్టీసీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ధ్రువపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరూ రోడ్డు భద్రతను పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, శిక్షకులు డీఎన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. ‘అమృతం’లో
ఆయువు తీసే నిర్లక్ష్యం!
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి బాలామృతం ఉచితంగా అంద జేస్తారు. దీనిని బాలలకు అమృతతుల్యంగా భావిస్తారు. బిడ్డకు పుష్టినిచ్చే ఈ బాలామృతం.. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యమవుతోంది. మందులౖకైా, తినే వస్తువులకై నా కాలపరిమితి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వాటిని వినియోగించరాదని స్పష్టంగా చెబుతారు. అటువంటిది చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఐసీడీఎస్ అధికారుల తీరు ఇందుకు భిన్నం. పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పసిబిడ్డల ఆరోగ్యాన్ని పెంచాల్సిన పౌష్టికాహారం.. కాంట్రాక్టర్ల అలక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దారి తప్పింది. గడువు తీరిన బాలామృతం ప్యాకెట్లను ప్రాజెక్టు పరిధిలో పంపిణీ చేయడం.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఆరోగ్యానికా.. అనారోగ్యానికా!
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడు నెలల పసికందు నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం ఇస్తారు. రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ఒక లబ్ధిదారుకు 25 రోజులకోసారి అందిస్తారు. తెలంగాణ నుంచి కాంట్రాక్టర్ ద్వారా వీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,475 ప్రధాన, 600 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 7 నెలల నుంచి 36 నెలల మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 27 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. చిన్నారులకు కాలం చెల్లిన బాలామృతం అందజేయడం ఆందోళన కలిగిస్తోంది. పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో గత నవంబర్ లో వచ్చిన సుమారు 2,786 ప్యాకెట్లలో అఽధిక భాగం కాలం చెల్లినవే కావ డం గమనార్హం. ప్యాకెట్లపై స్పష్టంగా 22/ 11అని గడువు తేదీ ఉన్నప్పటికీ వాటినే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అయితే, బస్తాల్లో ఉండిపో వడంతో గడువు తేదీ గమనించకుండా సర ఫరా చేసినట్టు గొడౌన్ సిబ్బంది చెబుతున్నారు. పొరపాటు జరిగిందని, ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సీడీపీఓ రేఖావాణి తెలిపారు.
ముగిసిన ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ


