
కొనసాగుతున్న డ్రైవర్ల నిరసన
పార్వతీపురం: అద్దె బస్సుల డ్రైవర్ల నిరసన నాలుగవ రోజు కొనసాగుతోంది. శుక్రవారం పార్వతీపురం ఆర్టీసీ డిపో గేటు వద్ద నల్ల బ్యా డ్జీలతో డ్రైవర్లు నిరసనలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డివేణు, జి.వెంకటరమణ, బి.సూరిబాబు తదితరులు మాట్లాడుతూ అద్దె బస్సుల యజమానులు, ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించి అద్దె బస్సు డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అద్దెబస్సు యజమానులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. సమస్యలు పరి ష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అద్దె బస్సు డ్రైవర్లు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు కేవీ చారి, పీడీ ప్రసాద్, ఎ.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుచేశారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
శాఖాపరమైన సమస్యల
పరిష్కారానికి పోలీస్ ‘‘వెల్ఫేర్ డే’’
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: శాఖాపరమైన సేవల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బంది సమస్యలతోపాటు శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ తమ సమస్యలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పోలీసుశాఖ సిబ్బంది పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీకి స్వయంగా తె లిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తనకు చేరిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అవకాశం ఉన్నంత మేరకు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

కొనసాగుతున్న డ్రైవర్ల నిరసన

కొనసాగుతున్న డ్రైవర్ల నిరసన