
పోలీసు వెల్ఫేర్ డే నిర్వహణ
విజయనగరం క్రైమ్: పోలీస్ శాఖ ప్రతి శుక్రవారాన్ని సిబ్బంది సంక్షేమానికి కేటాయించింది. ఈ మేరకు వారంలో ఒక్క రోజు ‘పోలీసు వెల్ఫేర్ డే’ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్‌లో శుక్రవారం వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలపై విజ్ఙాపనలు స్వీకరించారు. సిబ్బంది పనితనం, విధుల్లో ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యక్షంగా తన వద్దకు పిలిచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తానని చెప్పారు. వెల్ఫేర్ డే లో సిబ్బంది నుంచి అందుకున్న విజ్ఞాపనలను పరిశీలించారు.అనంతరం, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని సిబ్బందికి హామీ ఇచ్చారు. సిబ్బంది తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ స్వయంగా నోట్ చేసుకున్నారు.
సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఎస్పీ