
ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం
–8లో
విద్యావ్యాపారం..!
ఇంటర్మీడియట్ విద్య కోట్ల ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మారింది. వివిధ బ్యాచ్‌ల పేరుతో దోపిడీ సాగుతోంది.
విజయనగరం:
ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించేవారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతున్న మోసాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుచేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం మండల స్థాయి నాయకులు గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన అనంతరం ఆ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి కూటమి పాలనను వివరించాలన్నారు. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలే జగన్‌మోహన్‌రెడ్డి కావాలో.... చంద్రబాబు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన పూల్‌బాగ్‌లోని ఓ కల్యాణమండపంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట ప్రజలను ఏ విధంగా కూటమి నేతలు వంచిస్తున్నారో వీడియోలు ప్రదర్శించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరించారు.
హామీలను విస్మరించడం దగా చేయడం కాదా..?
ఇంత వేగంగా పార్టీ శ్రేణులను కలవాల్సి వస్తుందని అనుకోలేదు. ఐదేళ్లు ప్రభుత్వ పాలనలో ఎన్నికలకు రెండేళ్లు ముందు పార్టీ విధి విధానాలతో ప్రజల్లోకి వెళ్లడం ఆనవాయితీ. ఈ రోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఎన్నికల ప్రణాళికలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబుల్‌గా భావించి అమలు చేశాం. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అలానే అమలు చేస్తుందని 5 కోట్ల మంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఏడాది కాలం మాయమాటలతో పబ్బంగడిపేసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారం పక్షం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను మెడలు వంచి అమలు చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామంటూ బాండ్ పేపర్లు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఏడాదిగా ప్రతిజ్ఞను పక్కనపెట్టి మోసం చేస్తున్నారు. ఇది ప్రజలను దగా చేయటం కాదా అని ప్రశ్నిస్తున్నా.
– బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి
గ్రామాల్లో చేసిన వాగ్దానాలను ప్రశ్నించాలి
కూటమి నాయకులు ఎన్నికలకు ముందు గ్రామాల్లోకి వచ్చి చేసిన వాగ్దానాలపై ప్రశ్నించాలి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను చెప్పేందుకే బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం. జగన్‌మోహన్‌రెడ్డి న్యాయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. కూటమి నేతలు మాయమాటలతో పాలన చేస్తున్నారు. 150 హామీలు ఎక్కడ అమలు చేశారో... ఎవరికి చేశారో చెప్పాలి. ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ పేరిట భయపెడుతున్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను ప్రజల్లో నిలదీయాలి.
– పీడిక రాజన్నదొర,
మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు
మోసగించినా నమ్ముతారనే
భావనలో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేయడం అలవాటైపోయింది. ఎన్ని మోసాలు చేసినా ప్రజల నమ్ముతారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అలాంటి పాలనే సాగించారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించి బాధపడుతున్నారు. ఓడినా ప్రజల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమైన జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యానికి సలామ్ చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలి.
– కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం
సమావేశానికి హాజరైన నాయకగణం
పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, అల్లాడ సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిరిపురపు జగన్‌మోహన్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు పి.కృష్ణవేణి, యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి తూర్పటి వరలక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి తూముల అచ్యుతవల్లి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా ఉపాధ్యక్షురాలు మూకల కస్తూరి, జిల్లా అధికార ప్రతినిధులు సముద్రపు రామారావు, రేగాన శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, పార్టీ నాయకులు కె.వి.సూర్యనారాయణరాజు, కందుల రఘుబాబు, రొంగలి జగన్నాథం, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షుడు, నగరాధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో కూటమి వైఫల్యం
ప్రమాణాలు చేస్తున్నామంటూ ఇచ్చిన
బాండ్‌లకు విలువ ఎక్కడ..?
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై
ఇంటింటా ప్రచారం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 5 వారాల
బృహత్తర కార్యక్రమం
హామీల అమలుపై ప్రజలతో చర్చించి
చైతన్యవంతులు చేయండి
పార్టీ శ్రేణులకు శాసనమండలి
విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు
వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి
సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు
జిల్లా నలుమూలల నుంచి భారీగా
తరలివచ్చిన పార్టీ నాయకులు,
కార్యకర్తలు

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం