
● టార్పాలిన్లే రక్షణ
చిత్రంలో కనిపిస్తున్నది లక్కవరపుకోట మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడి అద్దె భవనంలో బ్యాంకు నిర్వహిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కారిపోతోంది. విధుల నిర్వహణకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లపై టార్పాలిన్లు వేసి విధులు నిర్వర్తిస్తున్నారు. రికార్డులు తడిసి ముద్దవుతుండడంతో బ్యాంకు ఉద్యోగులతో పాటు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన బ్యాంకును వేరే భవనంలోకి మార్చాలంటూ ఖాతాదారులు కోరుతున్నారు. – లక్కవరపుకోట