
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: తాగునీరు, భూమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీ దొందమానుగూడ గ్రామ గిరిజనులు పలువురు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావును కలిసి వినతపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఉన్న చైర్మన్ ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. మంచినీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామస్థాయిలో భూ సమస్యలపై చైర్మన్‌తో చర్చించారు. పైనాపిల్, కొండచీపుళ్లు, చిరుధాన్యాలు వంటి పంటలకు గిట్టుబాబు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. చైర్మన్‌ను కలిసిన వారిలో సవర సింహాచలం, హడ్డుబంగి శేషమ్మ ఉన్నారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు గిరిజనుల వినతి