
● పింఛన్ ఇప్పించండి సారూ..
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు జీవన్‌కుమార్. గంట్యాడ మండలం మదనాపురం గ్రామం. సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్నాడు. 2023 నవంబర్ 24న వ్యాధిని నిర్ధారిస్తూ కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ జారీచేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ఇచ్చే రూ.10వేల పింఛన్ కోసం పీహెచ్‌సీ వైద్యాధికారి ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు అర్జున, సూర్యనారాయణ ప్రశ్నిస్తే... మెడికల్ సర్టిఫికెట్‌పై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఉందని చెప్పారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి సీఎం ఫొటో ఉండడం మా తప్పా అంటూ వాపోతున్నారు. పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలంటూ కలెక్టరేట్‌లో అధికారులకు సోమవారం విన్నవించారు. ఇదే విషయంపై ఆర్‌బీకేఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవన్‌కుమార్‌కు ఇచ్చిన సికిల్ సెల్ వ్యాధి సర్టిఫికెట్‌పై వైఎస్సార్ పింఛన్‌కానుక, జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఉన్నందున తిరస్కరించాం. ఇప్పడు సర్టిఫికెట్‌పై ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని ఉండాలన్నారు.
– విజయనగరం ఫోర్ట్