
ఆత్మీయ కలయిక
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం
అనంతరం జరిగిన కలయికలో విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పార్టీ అధినేత సూచించినట్టు జెడ్పీ చైర్మన్ ఫోన్‌లో తెలిపారు. –విజయనగరం