రక్తికడుతున్న జిందాల్‌ డ్రామా! | - | Sakshi
Sakshi News home page

రక్తికడుతున్న జిందాల్‌ డ్రామా!

Jun 26 2025 6:08 AM | Updated on Jun 26 2025 6:08 AM

రక్తి

రక్తికడుతున్న జిందాల్‌ డ్రామా!

● ఓ వైపు జందాల్‌ కంపెనీ ఏర్పాటు చేయాలని.. ● మరోవైపు న్యాయం చేయాలంటూ వేర్వేరుగా శిబిరాల నిర్వహణ ● తాజాగా చదునుచేసే పనులతో నిర్వాసితుల్లో ఆందోళన

శృంగవరపుకోట: ఓ వైపు జిందాల్‌ కర్మాగారం కావాలంటూ స్థానికులతో సంబంధం లేనివారు శిబిరం నిర్వహణ... మరోవైపు తమకు తమ పిల్లల కు ఉద్యోగ భరోసా, పరిహారం చెల్లింపులో న్యా యం చేసి పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నిర్వాసితుల ఆందోళన... సమస్యపై స్పందించని అధికార యంత్రాంగం వెరసి ‘జిందాల్‌’ నాటకాన్ని ఎవరికి వారే రక్తికట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిబిరాల హైడ్రామాను చూసి స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతుంటే పీక్కుతినే రాబంధుల మాదిరిగా జిందాల్‌ నిర్వాసితుల పై రాజకీయ రాబంధులు వాలిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎవరికి తగ్గట్లు వారు నాటకీయంగా డైలాగులు చెబుతూ హైడ్రామా నడిపించడంపై ఆవేదన చెందుతున్నారు. జిందాల్‌ యాజమాన్యం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు పెడతామన్న ప్రతిపాదన ప్రస్తుతం నిర్వాసితుల్లో అలజడి రేపుతోంది. గతంలో జిందాల్‌ చేసిన ఒప్పందాలను ఎలా అమలు చేస్తారు? ఎవరు అమలు చేస్తారు.? ఉద్యోగాలు, పరిహారం, జీవన భృతి మాటేమిటంటూ రోడ్డెక్కా రు. నిర్వాసితులకు సరైన హామీ ఇచ్చాకే ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ప్రారంభించాలని ఎమ్మెల్సీ రఘురాజు కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

చెట్ల తొలగింపుపై ఆందోళన

పోలీస్‌ బందోబస్తు నడుమ బందవలస వద్ద జిందాల్‌కు చెందని భూముల్లో పాతికేళ్ల వయస్సున్న మామిడి తోటలను బుధవారం జిందాల్‌ దౌర్జన్యంగా తొలగించిందంటూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. జిందాల్‌కు సంబంధం లేని భూము లు కూడా లాక్కుందామని చూస్తున్నారని గిరిజన మహిళలు, రైతులు స్థానిక నాయకుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. 1960లో తాటిపూడి నుంచి తగిలేసి నిర్వాసితుల్ని చేశారని, ఇప్పుడు భూములు లాక్కు ని పొమ్మంటున్నారంటూ జిందాల్‌ సమస్య విచార ణకు వచ్చిన అధికారి కరుణాకరణ్‌ ఎదుట రైతులు వాపోయారు.

మా భూములు మాకివ్వాలి..

2013 భూహక్కు చట్టం ప్రకారం జిందాల్‌ యాజమాన్యం కంపెనీ ఏర్పాటు చేయనందున తమ భూములు తమకు ఇవ్వాలని కోరుతూ కొత్త అడ్డతీ గ కూడలి వద్ద నిర్వాసితులు బుధవారం నిరసన శిబిరం ప్రారంభించారు. వీరికి సీపీఎం, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు కంపెనీ కావాలంటూ కూటమి వర్గీయులు కొందరు మరో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు అటు, ఇటు వత్తాసు పలుకుతుండడంతో న్యాయం జరుగుతుందా? లేదా? అన్న సంకట స్థితిలో నిర్వాసితులు కొట్టుమిట్టాడుతున్నారు.

రక్తికడుతున్న జిందాల్‌ డ్రామా! 1
1/1

రక్తికడుతున్న జిందాల్‌ డ్రామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement