
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
బొబ్బిలి: వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని బొబ్బిలి తహసీల్దార్ ఎం.శ్రీను సూచించారు. మ్యుటేషన్లలో అక్రమాలపై ‘మ్యుటేషన్‌కు రూ.30 వే లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దా ర్ కార్యాలయంలో వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తో బుధవారం సమావేశం నిర్వహించారు. భూము లు ఆన్‌లైన్ వ్యవహారాలు చేసేటప్పుడు ఆ విధానా లు అందుబాటులో ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలన్నారు. ఏదేని మ్యుటేషన్ పనులు జరిగినప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇటీవల మండలంలో జరుగుతున్న, జరిగిన ఆన్‌లైన్ వ్యవహారాలపై ఆరా తీశారు. సమావేశం, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
ఇంటెలిజెన్స్ ఆరా!
‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి.
సంబంధిత ఉద్యోగులు మండలంలోని వీఆర్వోల తీరుతెన్నులపై ఉన్నతాధికారులకు సమాచారమందించినట్టు తెలిసింది. అసలు ఈ వ్యవహారంపై ముందుగానే ఆ అధికారులకు సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై అధికారులకు నివేదించే పనిలో సిబ్బంది ఉన్నారని తెలిసింది. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు కూడా భూముల ఆన్‌లైన్ వ్యవహారాలపై విచారణకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

పారదర్శకంగా విధులు నిర్వహించాలి

పారదర్శకంగా విధులు నిర్వహించాలి