
● అడ్డగో(డ)లుగా ఆక్రమణ!
చిత్రం చూశారా... కాలువ పక్కనే ప్రహరీ నిర్మించి ఆక్రమించిన స్థలం బొబ్బిలి మున్సిపాలిటీది. అధికార బలంతో ఓ వ్యక్తి ఇలా అడ్డంగా గోడకట్టి మున్సిపాలిటీ స్థలాన్ని సొంతం చేసుకున్నారు. మున్సిపల్ కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ స్థలాన్ని కేటాయించాలని అధికారులకు విన్నవించినా స్పందించ లేదు. ఇప్పుడు అడ్డగోలుగా ఆక్రమించినా మిన్నకుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, నాయకులు ఎం.ప్రసాద్, వి.సత్యనారాయణ అన్నారు. ఆక్రమణ స్థలాన్ని మంగళవారం పరిశీలించి ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రహరీ కూలదోసి మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. – బొబ్బిలి