
పీఏఏపీ జిల్లా అధ్యక్షుడిగా ‘వంగల’
పార్వతీపురం: ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఏఏపీ) పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా వంగల దాలినాయుడు నియామకయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య ఆదివారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో గల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వంగల దాలినాయుడు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో బంగారు పతకం సాధించిన హర్షిణి, తరుణ్, రోహిణి సత్య, బి. హర్షవర్థన్, వైష్ణవీదేవి, షణ్ముఖ సిద్ధార్థ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు, కోచ్ యశస్విని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్
విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒకరిని జీఆర్‌పీ సిబ్బంది ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్‌పీ ఎస్సై బాలాజీరావు మాట్లాడుతూ.. వైజాగ్ జీఆర్‌పీ డీఎస్పీ రామచంద్రరావు ఆదేశాలతో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతడ్ని విచారించగా.. రెండు సెల్‌ఫోన్లు అపహరించినట్లుగా తేలిందన్నారు. నిందితుడ్ని బొబ్బిలి మండలం చల్లవలసకు చెందిన ప్రసాద్‌గా గుర్తించామన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ రైల్వేకోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
మద్యం సీసాల స్వాధీనం
పూసపాటిరేగ: మండలంలోని మత్సవానిపాలెం అనధికారికంగా మద్యం కలిగి ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి దగ్గర నుంచి ఎనిమిది మద్యంసీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ ఆదివారం తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం తరలించినా, అమ్మినా కేసులు తప్పవని సీఐ హెచ్చరించారు.

పీఏఏపీ జిల్లా అధ్యక్షుడిగా ‘వంగల’

పీఏఏపీ జిల్లా అధ్యక్షుడిగా ‘వంగల’