
మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు
రేగిడి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు శోచనీయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని చిన్నశిర్లాంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ల మన్ననలు పొందేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బుచ్చయ్యచౌదరికి వయసు పెరుగుతున్నకొద్దీ బుద్ధి మందగిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ తల నరకవచ్చు కదా అని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ధూషిస్తే పదవులు వస్తాయని ఆశతో టీడీపీ నాయకులు ఇలా నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినప్పటికీ అమలు చేశామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని.. దీన్ని చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు పనికిమాలిన మాటలు అంటున్నారన్నారు. బుచ్చయ్యచౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈయనతో పాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్ మోహనరావు, యూత్ కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు, మీసాల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్