
కొఠియా సమస్యపై ముఖ్యమంత్రి,గవర్నర్లతో మాట్లాడాలి
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు గ్రామాలైన వివాదాస్పద కొఠియా గిరిజనులను ఒడిశా అధికారులు, పోలీసులు ఇబ్బందులు పెడుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గవర్నర్లతోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ అతిథిగృహంలో చైర్మన్‌తో సమావేశమై కొఠియా వివాదాస్పద గ్రామాల్లో జరుగుతున్న పరి ణామాలపై చర్చించారు. గడిచిన 55 సంవత్సరా లుగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 21గ్రామాల్లో 6 పంచాయతీల్లో వివాదం ఉందని వివరించారు. కార్యక్రమంలో పౌరవేదిక ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రామ్మోహన్ రావు, థాట్రాజు రాజారావు, తి రుపతిరావు, గోపాలరావు, ప్రధాన కార్యదర్శి జ లంత్రి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం