మస్కా | - | Sakshi
Sakshi News home page

మస్కా

Dec 4 2025 7:46 AM | Updated on Dec 4 2025 7:46 AM

మస్కా

మస్కా

మొబైల్‌ టాయిలెట్‌
వాటాలు కుదుర్చుకొని తీరిగ్గా 6 నెలల తర్వాత ప్రతిపాదనలు యోగా డే తర్వాత పలుమార్లు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జీవీఎంసీ సీఎంహెచ్‌వో తీరుపై తీవ్ర విమర్శలు

యోగా డే సందర్భంగా

ఏర్పాటు చేసిన మొబైల్‌ టాయిలెట్లు

ఒక్క రోజు అద్దె రూ.16 వేలంట.. మొత్తం అద్దె రూ.1.82 కోట్లు!

సీఎంహెచ్‌వో కనుసన్నల్లోనే..!

జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారుల వ్యవహారశైలి ఇప్పటికే పలు విమర్శలకు తావిస్తోంది. చికెన్‌ వ్యర్థాల తరలింపు వ్యవహారంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో పాటు ఏకంగా చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్టరుగా కూడా సదరు విభాగంలోని అధికారులు మారిపోయారనే ఆరోపణలున్నాయి. ఇక కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడంతో పాటు వారికి అందించే సామగ్రి విషయంలోనూ విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఒక్క యోగా డే నాడు కేవలం మొబైల్‌ టాయిలెట్ల పేరుతో రూ.1.82 కోట్లు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఒక్కో టాయిలెట్‌కు గతంలో రూ.5,900 చెల్లించడమే ఎక్కువని భావిస్తున్న తరుణంలో ఏకంగా రూ.16 వేల మేర చెల్లించేందుకు.. అది కూడా కార్యక్రమం ముగిసిన 6 నెలల తర్వాత తెరమీదకు తేవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్‌ పిలిచే అవకాశం ఉన్నప్పటికీ నామినేషన్‌పై ఎందుకు అప్పగించారనేది కూడా తేలాల్సి ఉంది. ఇందుకు జీవీఎంసీ కమిషనర్‌ ఎలా అంగీకరించారనేది కూడా తేలాల్సిన అంశం. ఈ వ్యవహారంలో పై నుంచి కింద దాకా అందరి వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి సభ్యుల వ్యవహారశైలి కూడా తేటతెల్లంకానుంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

యోగా డే పేరుతో వసూళ్లకు జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు చేస్తున్న చిత్రవిచిత్ర విన్యాసాలు ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. జూన్‌ 21వ తేదీన యోగా డే సందర్భంగా ఏర్పాటుచేసిన మొబైల్‌ టాయిలెట్లకు చెల్లింపులు విస్తుగొలుపుతున్నాయి. విచిత్రంగా కార్యక్రమం నిర్వహించిన 6 నెలల తర్వాత తీరిగ్గా అనుమతి కోసం స్టాండింగ్‌ కమిటీ ముందు ఉంచడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే కేవలం మొబైల్‌ టాయిలెట్లకే రూ.20 లక్షల మేర చెల్లింపుల కోసం గత స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో అనుమతి తీసుకున్న జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు.. ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు మరో రూ.1.62 కోట్ల మేర చెల్లింపులకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సమర్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే కేవలం మొబైల్‌ టాయిలెట్ల పేరుతో రూ.1.82 కోట్ల మేర ప్రజాధనాన్ని వెచ్చించడం గమనార్హం. దీనిపై స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. ఇప్పటికే జీవీఎంసీ ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీఎంహెచ్‌వో తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా దండుకున్న సదరు సీఎంహెచ్‌వో.. ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జీవీఎంసీలోని కీలక ప్రజా ప్రతినిధికి కూడా వాటాలు ఉన్నట్టు ప్రజారోగ్యశాఖ అధికారులు చర్చించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నేటి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని బట్టి అసలు వాస్తవాలు తేటతెల్లమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొత్త వాటి ధరే తక్కువే..!

వాస్తవానికి ఒక బయో టాయిలెట్‌ మార్కెట్‌లో రూ.15 వేలకు లభిస్తోంది. ఇక వందలు, వేలల్లో కొంటే రూ.10 వేల నుంచి రూ.12 వేలకు లభించే అవకాశం ఉంది. మన జీవీఎంసీ అధికారులు మాత్రం కేవలం యోగా డే ఒక్క రోజున బయో టాయిలెట్‌ను అందుబాటులో ఉంచినందుకే ఏకంగా రూ.16 వేల మేర మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అంటే కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అద్దె కంటే తక్కువ ధరకే కొత్త బయో టాయిలెట్‌ను కొనుగోలు చేయవచ్చన్నమాట. గత జూలై నెలలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో ఒక్కో బయో టాయిలెట్‌కు రూ.5,900 మేర చెల్లించారు. కేవలం ఆంధ్రా యూనివర్సిటీలోనే ఏకంగా 225 బయో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్న అధికారులు.. అక్కడ విడిది ఏర్పాటు చేసిన విద్యార్థులకు మాత్రం టాయిలెట్స్‌ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నారు. అయినప్పటికీ కేవలం ఏయూలో ఏర్పాటు చేశామని చెబుతున్న 225 బయో టాయిలెట్స్‌కు మాత్రమే కేవలం ఒక్క రోజుకే కోనసీమ సస్టెనబుల్‌ సొల్యూషన్స్‌ అనే కాంట్రాక్టర్‌కు రూ.13.27 లక్షల మేర చెల్లించేందుకు గత జూలై 19వ తేదీన జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఒక్కో బయో టాయిలెట్‌కు రూ.16 వేల మేర చెల్లించాలంటూ ప్రతిపాదనలను సమర్పించారు. అది కూడా ఏకంగా రూ.1.62 కోట్లకుపైగా ఉండటం గమనార్హం.

మస్కా1
1/1

మస్కా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement