మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించండి
విశాఖ లీగల్ : పర్యావరణ పరిరక్షణకు న్యాయవాదులందరూ కృషి చేయాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో భారతీయ న్యాయవాదుల ఫౌండేషన్, విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం, విశాఖ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ సంయుక్తంగా న్యాయవాదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘పరిశుభ్రత పచ్చదనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిర్మూలించడానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. మితిమీరిన కాలుష్యం మానవ మనుగడకు ఒక సవాల్‌గా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో భారతీయ న్యాయవాదుల ఫౌండేషన్ అధ్యక్షుడు యశ్వంత్ వర్మ, న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఆర్.సన్యాసినాయుడు, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, లోక్ అదాలత్ జాతీయ శిక్షకుడు రఘుపాత్రుని శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా కోర్డు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మొక్కలు నాటారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు


