
బాధ్యతగా విధులు నిర్వహించాలి
కొడంగల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మాస్టర్ ట్రైనర్స్ సూచించారు. బుధవారం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏఈఆర్‌ఓలు, ఏఎల్‌ఎంటీ, బీఎల్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రధాన అధికారి ప్రతి రోజూ పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాదర్శకంగా జవాబుదారీగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. కొడంగల్ మండల సిబ్బందికి స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల సిబ్బందికి ఈ నెల 8న బొంరాస్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో, దౌల్తాబాద్ మండల సిబ్బందికి 10వ తేదీ దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. వీరికి అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్ రవికుమార్, అబ్దుల్ హాఖ్, క్రాంతి, సాయిలు, భీమయ్య, బుడ్డయ్య శిక్షణ ఇస్తారు.
వీడియో కాన్ఫరెన్సలో మాస్టర్ ట్రైనర్స్
నేటి నుంచి శిక్షణ తరగతులు