
నేడు రౌండ్ టేబుల్ సమావేశం
అనంతగిరి: వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు, కార్యాచరణ రూపొందించేందుకు గాను రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని సంకల్ప్ స్కూల్‌లో సమావేశం ఉంటుందన్నారు. కావున జిల్లాస్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయులు, అధ్యాపక, న్యాయవాద, మేధావి, మహిళ, రైతు, వ్యాపార, వాణిజ్య, స్వచ్ఛంద, యువజన, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జయరాం కుటుంబం తుక్కుగూడలోని నార్త్ స్టార్ ఏర్‌పోర్ట్ బాలియార్డ్ విల్లాలో నివాసం ఉంటోంది. ఈయన కుమార్తె సురేఖ వెంకట దుర్గ(24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి వెంకట దుర్గ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. శివ అనే యువకుడిపై అనుమానం ఉందని తల్లి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.