
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
బంట్వారం: కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. పురుగు మందులు, విత్తనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీలర్లు స్టాక్ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. పురుగు మందులు, విత్తనాలు, ఎరువు కొనుగోలు చేసే రైతులు విధిగా రసీదులు తీసుకోవాలన్నారు. అనంతరం మద్వాపూర్ గ్రామాన్ని సందర్శించి రైతు రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. వర్షాకాలం పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచననలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రావ్య, ఏఈఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి