
కల్యాణ వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు
కందుకూరు: మండలంలోని తిమ్మాపూర్‌లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాచులూరు కోదండ రామస్వామి ఆలయంలో ఇండియా వాలీబాల్ మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత వెదిరె రవికాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ ఎం జ్యోతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీ నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏ శ్రీరాములు యాదవ్, కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అమరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.