
శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనలో నాయకులు
కొడంగల్ రూరల్ : మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన గుర్రాల వెంకటప్ప(50) బుధవారం గుండ్లకుంట గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లాడు. పనులు ముగిశాక రాత్రి కావడంతో అక్కడే నిద్రపోయాడు. గురువారం వెంకటప్పను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి కుమారుడు గుర్రాల ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిగౌడ్ తెలిపారు.
బైక్‌లు ఢీ.. బాలుడి మృతి
ఇద్దరికి తీవ్రగాయాలు
పరిగి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రుక్కుంపల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రుక్కుంపల్లికి చెందిన ఆంజనేయులు తన కుమారుడు శశాంక్(11)తో కలిసి పరిగి నుంచి గ్రామానికి వెళ్తుండగా.. కలెక్టర్‌రేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర బైక్‌పై ఎదురుగా వస్తున్న క్రమంలో ఢీకొన్నాయి. శశాంక్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు తండ్రి ఆంజనేయులుకు, నరేంద్రకు తీవ్రగాయాలు కావడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శశాంక్ పరిగి పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు
కుల్కచర్ల: బైక్ అదుపుతప్పి కిందపడటంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘట న మండల పరిధిలో చోటుచేసుకుంది. దోమ మండలం మల్లెపల్లికి చెందిన కృష్ణ (27) కుల్క చర్ల మండలం రాంనగర్ వచ్చి తిరిగివెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కొందరు 108 కి సమాచారం అందించడం సిబ్బంది బాధితుడిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నాగారంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన
ధారూరు: మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురువారం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. హన్మంత్‌రెడ్డి చత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. శివాజీ చూపిన మార్గంలో నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శశాంక్ మృతదేహం

గుర్రాల వెంకటప్ప మృతదేహం