రుణ లక్ష్యం సాధించాలి
తిరుపతి అర్బన్: పీఎం స్వనిధి పథకం పరిధిలో రుణ లక్ష్యం సాధించాలని, ఆ మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్‌చార్జి జేసీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బుధవారం ఆమె కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు ఇచ్చే సమయంలోనే పంట బీమా చేయించాలని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు బ్యాంకర్లు విద్యారుణాలు విరివిగా ఇవ్వాలని సూచించారు. ఏ బ్యాంక్‌కు ఆ బ్యాంక్ వారు లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని తెలిపారు. అలాగే పొదుపు సంఘం సభ్యులకు జాప్యం లేకుండా రుణాలు ఇవ్వాలని, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి రుణాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు చెందిన రాజేష్‌కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పరమేశ్వర్ నాయక్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్‌డీఎం రవికుమార్, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి దశరథరామిరెడ్డి, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్, మెప్మా పీడీ ఇఫ్రైన్ తదితరులు పాల్గొన్నారు.


