
వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై దాడి
చంద్రగిరి:వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా చంద్రగిరి మండలంలో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. మహిళా సర్పంచ్ కుటుంబంపైన, ఆతర్వాత దళిత మహిళపై దాడి ఘటనలు మరువక ముందే దళిత నాయకుడు, వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురానికి వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య ఎంపీటీసీ సభ్యురాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రవీణ్‌కుమార్‌పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలో జాతర నిర్వహణపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రవీణ్, గ్రామంలోని వెంకటరమణకు ఫోన్‌చేసి జాతర వివరాలను అడిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త అమ్మగుంట శీను, వెంకటరమణ వద్ద నుంచి ఫోన్ లాక్కుని ప్రవీణ్‌ను నానా దుర్భాషలాడాడు. ‘‘నువ్వు ఇక్కడు రారా.. ఇప్పుడున్నది మా ప్రభుత్వం. నిన్ను ఇక్కడ చంపకపోతే చూడు రా.. నా...’’ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికి ప్రవీణ్ గ్రామ పెద్దల వద్దకు వెళ్లాడు. వెంటనే అక్కడే ఉన్న కర్రలతో అమ్మగుంట శీను ఒక్కసారిగా ప్రవీణ్‌పై దాడికి తెగబడ్డాడు. దీంతో ప్రవీణ్ తల పగిలి, తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్థానికులు శీనును నిలువరించి, ప్రవీణ్‌ను హుటాహుటిన చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన టీడీపీ కార్యకర్త
చంద్రగిరిలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు
వైఎస్సార్‌సీపీలో ఉన్నాననే నాపై దాడి
వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తుడడంతోనే తన పై టీడీపీ కార్యకర్త దాడికి తెగబడ్డాడని బాధితుడు ప్రవీణ్ వాపోయారు. టీడీపీ నేతలు తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకే రక్షణ కరువైతే సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ పంచాయతీ అధ్యక్షుడిపై దాడి