
ఘనంగా సీజీఎస్‌టీ వార్షికోత్సవం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): తిరుపతిలోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్‌టీ) కమిషనరేట్ పరిధిలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 8వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కార్యాలయ ఆవరణలో శ్రీసరళీకృత పన్నులు, పౌరుల సాధికారత్ఙ అనే థీమ్‌పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పన్నుల చెల్లింపులలో అగ్రశ్రేణి సంస్థలుగా గుర్తించిన ఏడింటిలో శ్రీసిటీలోని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు అవార్డు దక్కింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, తిరుపతి సీజీఎస్‌టీ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.దినకరన్ సమక్షంలో గుంటూరు సీజీఎస్‌టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్ ఎంపిక చేసిన సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు.
30 వరకు జన సురక్ష
తిరుపతి అర్బన్: జన సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 774 పంచాయతీల్లోనూ ఈ నెల1 నుంచి 30 వరకు జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరో సమావేశంలో జేసీ శుభం బన్సల్‌తో కలిసి మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా డిసిప్లినరీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.