
భార్య పుట్టింటికి.. భర్త ఆత్మహత్మ
చిల్లకూరు : భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు తిప్పగుంటపాళెంలో మిక్సెడ్ కాలనీకి చెందిన తాటిపర్తి ఏడుకొండలు(25)కు ఉషాతో వివాహమైంది. కొంత కాలంగా సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు చోటు చోసుకోవడంతో 8 నెలల క్రితం ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం రోజున స్థానికులకు కనిపించిన ఏడుకొండలు తరువాత కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పరిశీలించగా, ఇంటిలోపలి నుంచి గడియ వేసి ఉంది. దీంతో తహసీల్దార్ శ్రీనివాసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు తీసి లోపలకు వెళ్లిన పోలీసులు కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
95.89 శాతం పంపిణీ
తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ మంగళవారం తొలి రోజు 95.89 శాతం మందికి అందించినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. జూలై నెలకు 2,59,732 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా, 2,49,054 మందికి అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి బుధవారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.