
తొలిరోజే తాళాలు
తిరుపతి అర్బన్: కూటమి సర్కార్ మళ్లీ మొదటికే వచ్చింది.. తొలి రోజు తిరుపతి నగరంలో చాలా వరకు రేషన్ షాపులు తెరుచుకోలేదు. కొందరు తెరిచినా సర్కర్ పనిచేయకపోవడంతో తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో సంచులు, కార్డులు క్యూలో పెట్టిన లబ్ధిదారులు ఏం చేయాలో తెలియక కాసేపు ఎదురుచూసి వెళ్లిపోయారు. అతికష్టం మీద నడుచుకుంటూ వచ్చిన వృద్ధులు, సరుకులు ఇవ్వకపోవడంతో ఊత కర్ర పొడుచుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వెళ్లిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఎగనామం పెట్టారు. కేవలం బియ్యంతోనే సరిపెట్టారు. ఆ తర్వాత మూడు నెలలు బియ్యం, చక్కెర మాత్ర మే అందించారు. ఆ తర్వాత నాలుగు నెలలు కందిపప్పు అరకొరగా అందించారు. రెండు నెలల నుంచి మళ్లీ కందిపప్పు కొందరికే ఇస్తూ వచ్చారు. తాజాగా జూలైలో కందిపప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం, చక్కెరతోనే సరిపెట్టేశారు. జిల్లాలో 1457 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 6 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే తొలి రోజు సర్వర్ సమస్యలతో పలు దుకాణాల్లో సరుకులు ఇవ్వడం మానేశారు. కొన్ని దుకాణాల్లో గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు క్యూలో ఉండలేక, ఇంటిదారి పట్టారు. మరోవైపు జిల్లాలో 345 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలకు అప్పగించారు. వారంతా కాసేపు చూసి.. సర్వర్ పనిచేయకపోవడంతో దుకాణాలు మూసివేశారు. దీంతో కార్డుదారులు బిక్కముఖంతో ఇంటిదారి పట్టారు.

తొలిరోజే తాళాలు

తొలిరోజే తాళాలు

తొలిరోజే తాళాలు