
హామీల అమలులో విఫలం
● వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వెంకటగిరి(సైదాపురం) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నేదురుమల్లి మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో సాగిస్తున్న అరాచకపాలనకు ప్రజలే చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే జగనన్న ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జూలై 8వ తేదీన వెంకటగిరిలో రీకాల్ మేనిఫెస్టో చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పకడ్బందీగా నవరత్న పథకాలను అర్హులందరికీ అందించారని కొనియాడారు. ప్రస్తుత ంసీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తానని, సూపర్‌సిక్స్ హామీలను నెరవేరుస్తాని బూటకపు హామీలు గుప్పించి, ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా సర్కారు చేసింది శూన్యమని వెల్లడించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించేందుకు నెల్లూరు వస్తున్న జగనన్నను అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హెలీప్యాడ్ కోసం స్థలం ఇచ్చిన ఓ విద్యాసంస్థ యాజమాన్యంపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే..
రాష్ట్రంలో 2027లోనే జమిలి ఎన్నికలు జరగనున్నట్లు నేదురుమల్లి రామ్‌కుమారెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం వరిస్తుందని వెల్లడించారు. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి , వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య, పూజారి లక్ష్మి, రాపూరు, సైదాపురం,బాలాయపల్లి, డక్కిలి మండల కన్వీనర్లు మధుసూదన్‌రెడ్డి, మన్నారపు రవికుమార్‌యాదవ్, వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులురెడ్డి, నేతలు సదారెడ్డి,చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు ఆవిశంకరయ్య, దనియాల రాధ, సుబ్బారావు, సుకన్య, సుభావలీ,అటంబాక శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీనివాసులురాజు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.