ఎంబీయూలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎంబీయూలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ

Jun 26 2025 6:07 AM | Updated on Jun 26 2025 6:07 AM

ఎంబీయూలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ

ఎంబీయూలో ముగిసిన ఎన్‌సీసీ శిక్షణ

చంద్రగిరి : మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)లో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 550 మంది విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. బుధవారం దాసరి ఆడిటోరియంలో చేపట్టిన ముగింపు కార్యక్రమంలో గ్రూప్‌ కమాండర్‌ అంజు దమియా, కల్నల్‌ సంజయ్‌ సింగ్‌, ట్రైనింగ్‌ అధికారి కల్నల్‌ సందీప్‌ మాట్లాడుతూ క్రమశిక్షణ, ఐక్యత, ఏకాగ్రతపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఫైరింగ్‌, డ్రిల్‌ నైపుణ్యాలతోపాటు సాంస్కృతిక, క్రీడా పోటీలను చేపట్టినట్లు వివరించారు. విద్యార్థి దశ నుంచి దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంబీయూ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆపదలో ఉన్నవారి రక్షణకు చేపటాల్సిన చర్యలపై విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.

కర్ణాటక మద్యం పట్టవేత

తిరుపతి క్రైమ్‌ : తిరుపతిలో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఈస్ట్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చంద్రగిరి మండలం ఐతేపల్లెకు చెందిన బెల్లంకొండ షేక్‌ హస్మత్‌ ఉల్లా బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఉండగా అనుమానంతో ఈస్ట్‌ పోలీసులు తనిఖీ చేశారు. నిందితుడి వద్ద కర్ణాటకకు చెందిన 10 టెట్రా మద్యం ప్యాకెట్లు ఉన్నాయి. బహిరంగంగా విక్రయించేందుకు మద్యం ప్యాకెట్లు తన వద్ద ఉంచుకున్నట్టు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌జీ హేమాద్రి తెలిపారు.

కామాంధుడికి దేహశుద్ధి

సత్యవేడు: మండలంలోని చెన్నేరి గ్రామంలో ఓ బాలిక (11)పై అదే గ్రామానికి చెందిన ఆర్‌.నాగరాజు(38) బుధవారం సాయంత్రం లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేడయడంతో స్థానికులు గుర్తించి కామాంధుడికి దేహశుద్ధి చేశారు. తల్లిదండ్రులు ఊత్తుకోటకు వెళ్లడంతో సమయం చూసి నిందితుడు ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక తల్లిదండ్రులు సత్యవేడు పోలీసులను ఆశ్రయించగా డీఎస్పీ రవికుమార్‌ సూచనల మేరకు సీఐ మురళీ నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రామస్వామి కేసు నమోదు చేశారు. అయితే నిందితుడికి మతిస్థిమితం లేదని, ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ విద్యార్థుల అరెస్టు

తిరుపతి క్రైమ్‌: ఇతరుల పేరుతో పరీక్షలు రాయడానికి తిరుపతికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అరెస్టు చేసింది. నగరంలోని సాయినగర్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించింది. వారు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చారని, వేరే వారి పేరుతో ఆన్‌లైన్‌ పోటీ పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి నకిలీ ఆధార్‌ కార్డులు, సెల్‌ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement