
నిరంకుశ పాలనపై నిరసన
● చెవిరెడ్డి అరెస్ట్ అన్యాయం ● రెడ్‌బుక్ రాజ్యాంగానికి త్వరలోనే కాలం చెల్లుతుంది ● ప్రభుత్వ దారుణాలకు ప్రజలే బుద్ధి చెబుతారు ● వైఎస్సార్‌సీపీ పాకాల నేతలు
పాకాల : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ పాకాల నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి త్వరలోనే కాలం చెల్లుతుందన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న దారుణాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెవిరెడ్డి ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, సాధ్యమైనంతవరకు అందరికీ మంచే చేశారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి ద్వారా లబ్ధిపొందని కుటుంబమే లేదని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నంగా నరేష్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, కపిలేశ్వర్‌రెడ్డి, రైతు సంఘం నేత భాస్కర్‌నాయుడు, ఎంపీపీ లోకనాథం, మునీర్, రహీమ్, గుండ్లూరి సురేష్, వినాయక, రమేష్, చంటి, లోకనాథరెడ్డి, బాను, ఇమ్రాన్, గోపి, సద్దాం పాల్గొన్నారు.