
‘కెనాల్’ కట్టలపై చెట్ల నరికివేత
వాకాడు : మండలంలోని పంబలి లాకుల వద్ద బకింగ్‌హామ్ కెనాల్ కరకట్టలపై చెట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నరికేస్తున్నారు. కట్టెలను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కెనాల్ వద్ద విధులు నిర్వర్తించే లస్కర్ సైతం అక్రమార్కులతో కుమ్మకై ్క విలువైన వృక్ష సంపదను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కట్టెల తరలింపునకు అనువుగా వాహనాలు రాకపోకలు సాగించేందుకు కెనాల్ కరకట్టలను ధ్వంసం చేసి రహదారిని సైతం నిర్మించడం గమనార్హం. బకింగ్‌హామ్ కెనాల్ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేందుకు యత్నిస్తున్న అక్రమార్కులపై కొందరు స్థానికులు మండిపడుతున్నారు. వారికి సహకరిస్తున్న లస్కర్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ రవాణాకు పంబలి వాసులు అడ్డుపడకుండా లస్కర్ మధ్యవర్తిత్వం నడిపి గ్రామానికి కొంత నగదు సైతం ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారు. కరకట్టలపై చెట్లను ఆధునిక యంత్రాల సాయంతో నరికి లారీల ద్వారా చైన్నె, గుమ్మిడిపూండి తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బకింగ్‌హామ్ కెనాల్‌ను పరిరక్షించాల్సిన అవసరముంది.

‘కెనాల్’ కట్టలపై చెట్ల నరికివేత