‘కియోస్క్‌’తో శ్రీవారి లడ్డూలు | - | Sakshi
Sakshi News home page

‘కియోస్క్‌’తో శ్రీవారి లడ్డూలు

Jun 24 2025 3:23 AM | Updated on Jun 24 2025 3:23 AM

‘కియోస్క్‌’తో శ్రీవారి లడ్డూలు

‘కియోస్క్‌’తో శ్రీవారి లడ్డూలు

తిరుమల : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయానికి టీటీడీ కియోస్క్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నగదు లేకుండా యూపీఐ చెల్లింపుల వెసులుబాటు కల్పించింది. దీంతో భక్తులకు త్వరితగతిన లడ్డూలు కొనుగోలు చేసుకునేలా చర్యలు చేపట్టింది.

ప్రక్రియ ఇలా..

● లడ్డూ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్‌ యంత్రం వద్దకు వెళ్లాలి.

● దర్శన టికెట్‌ ఉన్నవారు, దర్శన టికెట్‌ లేనివారు. అనే రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి.

● టికెట్‌ వివరాలను యంత్రం ధ్రువీకరిస్తుంది. టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూలకు అనుమతిస్తుంది.

● దర్శన టికెట్‌ లేనివారు ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలి. ఇందులో ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. సరైన ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement