
ఎరచ్రందనం కేసులో ఐదుగురికి జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం చెట్లు నరికి తరలించేందుకు యత్నించిన కేసులో ఐదుగురు నిందితులకు ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.6లక్షల వంతున జరిమానా విధిస్తూ తిరుపతిలోని రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ కోర్టు జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు..వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జి.భాస్కర్ నాయుడు, గువ్వ వెంకటయ్య, , గంగరాజు వెంకట్రామరాజు, షేక్ హఫీజుల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన కుర్ర పాటి సురేందర్ నాయుడు 2020 నవంబర్ 14వ తేదీ రాత్రి ఎర్రకొండ అటవీప్రాంతం నుంచి ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డారు. ఐదుగరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
1న డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ?
తిరుపతి సిటీ: రెండు నెలలుగా ఎదురు చూస్తున్న డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జూలై 1న విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తునట్లు సమాచారం. దీంతో జిల్లాలోని సుమారు 35వేల మంది విద్యార్థులకు కాస్త ఊరట లభించినట్‌లైంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై సుమారు 3 నెలలు కావస్తున్నా డబుల్ మేజర్ సబ్జెక్ట్‌ల విధానం పేరుతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చింది.