సూపర్‌ సిక్స్‌..ఎగ్గొట్టడం ఫిక్స్‌ | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌..ఎగ్గొట్టడం ఫిక్స్‌

Published Fri, May 10 2024 5:20 PM

సూపర్‌ సిక్స్‌..ఎగ్గొట్టడం ఫిక్స్‌

బాబు మాయలో పడొద్దు

అబద్ధాల మేనిఫెస్టో నమ్మొదు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం) : ‘ఎన్నికల సమయంలో ఎనేన్నో హామీలు ఇవ్వడం.. గెలిచాక వాటిని విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ కూడా ఇలాంటిదే. బాబు మాయమాటలు నమ్మి, ఆయన మాయలో పడొద్దు’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఓటర్లకు విజ్ఙప్తి చేశారు. ఆయన గురువారం వెంకటగిరిలోని ఎన్‌జేఆర్‌ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిలువునా ముంచాడన్నారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని గుర్తుచేశారు. తన తల్లి రాజ్యలక్ష్మి 2005 వెంకటగిరిని మున్సిపాలిటీ చేశారని, అదేవిధంగా 2006లో వెంకటగిరి ప్రజల దాహార్తికి సమ్మర్‌స్టోరేజ్‌ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

పదేళ్లలో కురుగొండ్ల ఏమి చేశారు?

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ 2014 నుంచి 2019 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేలను సీఎం జగనన్న ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement