
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నియామకాలు చేపట్టే నామినేటేడ్ పదవుల్లో బీసీలకు తొ మ్మిది కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పో రాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల జనాభా శాతం 56శాతం ఉండగా రాష్ట్రంలో 54 నామినేటెడ్ పదవులు ఉన్నాయని, బీసీలకు జ నాభా ప్రాతిపదికన 27 పదవులు ఇవ్వాలి కానీ, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 17 పదవులు మాత్రమే కే టాయించిందని పేర్కొన్నారు. 7శాతం జనాభా ఉ న్న అగ్రకులాలకు 17 పదవులు ఇచ్చిందని, దీంతో సామాజిక న్యాయం జరగడం లేదని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, కనీసం నామినేటేడ్ పదవుల్లోనైనా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమితి నాయకులు శ్రీపతి రాములు, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, కొంతం రాజు, ఇన్నారం కిరణ్, సిద్ధ పటేల్ పాల్గొన్నారు.