కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్‌ | Sakshi
Sakshi News home page

కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్‌

Published Mon, May 20 2024 5:44 PM

Teen Who Killed 2 With Porsche Got Bail In 15 Hours In Pune

తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్‌కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది.

వివరాలు.. పుణెలో మైనర్‌ బాలుడి డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో ఆదివారం తెల్లవారుజామున  పోర్స్చే కారును అతివేగంగా నడిపిన 17 ఏళ్ల బాలుడు బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అనీష్‌ అవధియా, అశ్విని కోష్ట ఎగిరి పడ్డారు. కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో కారు గంటకు 200 కి.మీ వేగంతో  ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అయితే బాలుడు అరెస్టైన 15 గంటల్లోనే కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు మైనర్‌ అవ్వడం వల్ల కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అతని తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ చెప్పారు. బాలుడు 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, ప్రమాదాలపై వ్యాసం రాయాలని కోర్టు తెలిపింది. మద్యపానం సేవించకుండా ఉండేందుకు చికిత్స చేయించుకోవాలని, అలాగే కౌన్సెలింగ్ సెషన్‌లు తీసుకోవాలని తెలిపింది. కాగా నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం గమనార్హం.

 

Advertisement
 
Advertisement
 
Advertisement