
మొహర్రం, బోనాల ఊరేగింపుల్లో పోకిరీలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం, బోనాలు ఊరేగింపుల్లో పోకిరీలు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా, అనుచితంగా తాకుతూ మహిళలు, యువతులను వేధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ షీ–టీమ్స్ నిఘాలో మొత్తం 478 మంది పట్టుబడినట్లు డీసీపీ డాక్టర్ ఎన్‌జేపీ లావణ్య మంగళవారం ప్రకటించారు.
దీనికోసం షీ–టీమ్స్ రహస్య కెమెరాలు వినియోగించాయి. చిక్కిన పోకిరీల్లో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ ఆకతాయిల్లో నలుగురిపై పెట్టీ కేసులు, నగంలోని వివిధ ఠాణాల్లో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. మిగిలిన వారిని మందలించి పంపారు.
#WomenSafety - #Hyderabad
SHE Teams caught a total of 478 people red-handed for Misbehaving with Women Devotees during #Bonalu , including 386 majors and 92 minors in Hyderabad#SHETeams of @hydcitypolice apprehended several individuals red-handed for #misbehaving with #women… pic.twitter.com/7EDBUgo4JN— Surya Reddy (@jsuryareddy) July 15, 2025