
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కోయంబత్తూరులో యువ ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగం
‘నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ –2025’ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం త్వర లో దేశ మొబి లిటీ హబ్‌గా అవతరిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఫార్ములా ఈ’రేస్ రూ.700 కోట్ల ఆర్థిక కా ర్యకలాపాలను సృష్టించడం ద్వారా అంతర్జాతీ య దృష్టిని ఆకర్షించిందన్నారు.
‘ఫార్ములా ఈ’ కేవలం ఒక క్రీడా కార్య క్రమం కాదని, ఆవిష్కర ణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికత కు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టేందుకు ఒక ప్రతీకగా నిలిచిందని అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం జరిగిన 10వ ‘ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు – 2025’కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
యువత రేసు కారులా దూసుకెళ్లాలి..
‘మోటార్‌స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు, అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసు కోవడం. జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలి. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని మీరే సృష్టించుకోవాలి.
పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు’అని కేటీఆర్ ఉద్బోధించారు. రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదనే సందేహాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ సాకారమై, 11 ఏళ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచింది’అని కేటీఆర్ పేర్కొన్నారు.