
ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీడు వద్ద వైరా నదిపై రూ. 630.30 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వాకాటి శ్రీహరి. శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘నాగార్జున సాగర్ నీరు ద్వారా నే ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. మధిర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ జోను- 3 నుండి జోన్ -2 గా మారింది. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషివల్లే ఆగిపోయాయి. పోలవరం ఎత్తు తగ్గించాలి. అమాయకులైన 2 లక్షల గిరిజన భూములు ముంపుకు గురవుతున్నాయి’ అని పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. అత్యంత కష్టం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీనీ నిలబెట్టింది భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆర్థికశాఖ మంత్రిగా భట్టివిక్రమార్క సమర్థవంతంగా గాడిలో పెట్టారు. గత ప్రభుత్వం పదేళ్లల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసింది. అయినా పార్టీ చెక్కుచెదరలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. బనకచర్ల ప్రాజెక్టుకు మేము పూర్తిగా వ్యతిరేకం. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ ఇదే చెప్పింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది’ అని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘జోన్- 3లో ఉన్న 33 వేల ఆయకట్టు జోన్ 2 గా మార్పు. గత ప్రభుత్వం పేద, అప్పుల తెలంగాణగా మార్చింది. మూడు విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మా ఇల్లు పంపిణి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.భూ సమస్యను భూ భారతి ద్వారా శ్వాసత పరిష్కారం’అని తన ప్రసంగంలో తెలిపారు
మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘ పేదోడి పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.