పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య | Duvvur Chandrasekhar Reddy passed away: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య

Aug 29 2025 3:50 AM | Updated on Aug 29 2025 3:50 AM

Duvvur Chandrasekhar Reddy passed away: Andhra pradesh

ఖమ్మంక్రైం: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు ఖమ్మంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి (77) పుచ్చలపల్లికి మేనల్లుడు. చంద్రశేఖర్‌రెడ్డి భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందగా ఆయన అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెల వద్ద కొంతకాలం ఉన్నారు. ఆపై హైదరాబాద్‌ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.

కాగా, ఆయన జీవితంపై విరక్తి చెందినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం కాశీ యాత్రకు కూడా వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో బుధవారం ఖమ్మంలో రైలు దిగి స్టేషన్‌కు కొద్ది దూరాన ఉన్న మామిళ్లగూడెం ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వద్ద లభించిన సెల్‌ఫోన్, ఆధార్‌ కార్డ్‌లోని వివరాల ఆధారంగా అధికారులు బంధువులకు సమాచారం ఇచ్చారు. అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో భౌతికకాయాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి బంధువులు ఖమ్మం చేరుకుని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement