టీ స్క్వేర్‌ ఐకానిక్‌ బిల్డింగ్‌గా ఉండాలి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Review On T Square Works | Sakshi
Sakshi News home page

టీ స్క్వేర్‌ ఐకానిక్‌ బిల్డింగ్‌గా ఉండాలి: సీఎం రేవంత్‌

Oct 11 2025 4:13 PM | Updated on Oct 11 2025 6:32 PM

CM Revanth Reddy Review On T Square Works

హైదరాబాద్:  టీ స్క్వేర్‌ భవనం అనేది ఐకానిక్‌ బిల్డింగ్‌లా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.  దీనికి సంబంధించి నవంబర్‌ నెల చివరి నుంచి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్‌ 11వ తేదీ) ఐసీసీలో ఏఐ హబ్‌ టీ సక​‍్వేర్‌పై సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు జయేష్‌ రంజన్‌, సంజయ్‌ కుమార్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజేఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్‌ ండీ వేణు ప్రసాద్‌, ఐటీ శాఖ డిప్యూటి సెక్రటరీ భవేష్‌ మిశ్రా , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ మేరకు సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘టీ స్క్వేర్  నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. టీ స్క్వేర్ లో  ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.  యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి. టీ స్క్వేర్  24 గంటల పాటు పని చేయాలి. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో భవనాలను పరిశీలించాలి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఏఐ హబ్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి*అని సూచించారు.

ఏఐ హబ్, టీస్వ్కేర్ ప్రాజెక్టులపై ఐసీసీసీలో సీఎం సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement