రేర్ కాంబినేషన్ సెట్ అవుతుందా?
తమిళసినిమా: సినీ పరిశ్రమలో రేర్ కాంబినేషన్‌న్స్ అరుదుగా సెట్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలకు వచ్చే క్రేజే వేరు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అలా పలు రేర్ కాంబినేషన్‌న్స్‌తో కలిసి పని చేసి విజయాలను అందుకున్నారు. ఈయన మొదటి చిత్రాన్నే అజిత్, సురేష్ గోపి కాంబినేషన్లో చేసిన దీనా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కాంత్ హీరోగా దర్శకత్వం వహించిన రమణ, సూర్య కథానాయకుడిగా చేసిన గజిని, అదే చిత్రాన్ని హిందీలో అమీర్‌ఖాన్‌తో చేసి ఘన విజయం సాధించారు. అదేవిధంగా విజయ్ హీరోగా కత్తి , సర్కార్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. రజనీకాంత్‌తో చేసిన దర్బార్, తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ చిత్రాలు మాత్రం నిరాశ పరిచాయి. కాగా ఇటీవల శివకార్తికేయన్‌తో చేసిన మదరాసీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్నే అందుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. అందుకు సమాధానంగా ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే తర్వాత శింబు హీరోగా మురుగదాస్ చిత్రం చేయబోతున్నది. ఈ రేర్ కాంబినేషన్లో చిత్రం నిజంగా తెరకెక్కితే ఆ క్రేజే వేరుగా ఉంటుంది కదూ. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం అరసన్‌లో శింబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారన్నది టాక్.
శింబు
దర్శకుడు
మురుగదాస్,


