60శాతం ఆ చిత్ర కథేనా?
తమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ చిత్రం కావడం గమనార్హం. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన హెచ్.వినోద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. కాగా పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజూ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబిడియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు దర్శకుడు వినోద్ కమలహాసన్ కోసం ఒక కథను సిద్ధం చేశారు. అయితే ఆ కథలో కమలహాసన్ నటించ లేదు. దీంతో అదే కథను విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ తెలుగులో నటించిన నేలకొండ భగవత్‌కేసరి చిత్రానికి ఇది కాపీ అని జరిగింది. ఇలాంటి ప్రచారాన్ని దర్శకుడు ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే నేలకొండ భగవత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విజయ్ నటించిన చిత్రం ఇది. సమకాలీన రాజకీయ అంశాలు ఇందులో చోటు చేసుకుంటాయని తెలిసింది. దీంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతు న్నారు.
60శాతం ఆ చిత్ర కథేనా?


