సిరై సింగిల్ సాంగ్ విడుదల
తమిళసినిమా: విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సిరై. సెవెన్ స్క్రీన్‌న్స్ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎల్కే అక్షయ్‌కుమార్ మరో ప్రధాన పాత్రను పోషించారు. ఆనంద నాయకిగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, తమిళ్ కథను అందించారు. ఆయన నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రాసినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఈ వైవిధ్య భరిత కథా చిత్రానికి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. ఈమె దర్శకుడు వెట్రిమారన్ శిష్యురాలు అన్నది గమనార్హం. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులోని మన్నిచ్చిడు అనే పల్లవితో సాగే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ పాటను వేలూరులో విక్రమ్‌ప్రభు, ఆనందలపై చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. గాయనీగాయకులు సత్యప్రకాష్, ఆనంది జోషి పాడిన ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని, చిత్ర శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ పొందినట్లు నిర్మాతల వర్గం తెలిపింది.
సిరై చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్


