
క్లుప్తంగా
కుమార్తె ప్రేమ వివాహం
చేసుకోవడంతో..
● తల్లి ఆత్మహత్య
అన్నానగర్: తిరువొత్తియూర్ సమీపంలో తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చైన్నెలోని తిరువొత్తియూర్ సత్యమూర్తి నగర్ నివాసి రమణి (37). ఆమె భర్త దేవేంద్రన్. వీరికి కార్తీక్ అనే కుమారుడు, గాయత్రి అనే కుమార్తె ఉన్నారు. ఈ పరిస్థితిలో, అభిప్రాయ భేదాల కారణంగా గత 12 సంవత్సరాలుగా భర్త నుంచి విడిపోయి వేరుగా నివసిస్తున్న రమణి, విఘ్నేష్ (31)తో కలిసి నివసిస్తున్నట్లు తెలుస్త్తోంది. ఇంతలో ఆమె కుమార్తె గాయత్రి, పుదువన్నారపేటైకి చెందిన సారథిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ రమణికి తన కుమార్తె సారథిని వి వాహం చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన రమణి శుక్రవారం మధ్యాహ్నం తన బెడ్ రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరువొత్తియూర్ పోలీసులు వెళ్లి రమణి మతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృత్తివిద్యా కోర్సులు
అభ్యసించాలి
వేలూరు: విద్యార్థులు వృత్తివిద్యా కోర్సులను ఎంపిక చేసుకుని అభ్యసించాలని చైన్నెలోని తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ముగం అన్నారు. వేలూరులోని ఏలగిరి ప్రాంగణంలో వీఐసీటీ కమ్యూనిటీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, ప్రసంగించారు. వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి రాష్ట్రంతోపాటు ఇతర దేశాల్లోనూ పలు అవకాశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, తిరువణ్ణామలై రీజినల్ కేంద్రం అధికారి హెల్సన్, ఆర్ రవి, దేవదాయ శాఖ విభాగం ట్రస్టీ ప్రొఫెసర్ పరంజ్యోతి, చిత్తూరు పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాసనపల్లి పీటర్, ద్రావిడ ముస్లిం మున్నేట్ర కయగం చైర్మన్ ఇక్బాల్, ప్రొఫెసర్ అన్సారీ, వీఐసీటీ విద్యా ట్రస్టీ, సమన్వయ కర్త డాక్టర్ అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రైళ్ల వేళలో మార్పులు
తిరువొత్తియూరు: తిరువనంతపురం డివిజన్‌న్‌లో జరుగుతున్న వివిధ నిర్వహణ పనుల కారణంగా రైలు వేళల్లో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ నెల 8, 9 తేదీల్లో రాత్రి 10.40 గంటలకు తాంబరం నుంచి బయలుదేరే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు (20691) నైల్లె, నాగర్‌కోయిల్ మధ్య పాక్షికంగా రద్దు చేసి, నైల్లెలో నిలిపి వేస్తారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటలకు చైన్నె సెంట్రల్ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రైలు (12695) కొట్టాయం తిరువనంతపురం సెంట్రల్ మధ్య పాక్షికంగా రద్దు చేసి, కొట్టాయం వరకు నడుస్తోంది. అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు (20692) 9వ తేదీ మధ్యాహ్నం 3.50 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరి తాంబరం చేరాల్సి ఉనప్పటికీ, సాయంత్రం 5.10 గంటలకు నైల్లె నుంచి బయలుదేరి తాంబరం చేరుకుంటుంది. ఎక్స్‌ప్రెస్ రైలు (12696) 26వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి చైన్నె సెంట్రల్‌కు రావాల్సి ఉంది. అయితే కొట్టాయం నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరి సెంట్రల్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారి తెలిపారు.
శరవేగంగా బస్టాండ్
అభివృద్ధి పనులు
పళ్లిపట్టు: పొదటూరేపేట బస్టాండ్‌ను రూ. 1.50 వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. పళ్లిప ట్టు సమీపంలోని పొదటూరుపేట బస్టాండ్‌లో రూ. 70 లక్షల వ్యయంతో టౌన్ పంచాయతీ ద్వారా దుకాణాల సముదాయ భవనం నూత నంగా నిర్మించారు. 18 దుకాణాలతో నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే బస్టాండ్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించేలా బస్టాండ్ పూర్తిగా రూపింగ్ ఏర్పాటుకు సంబంధించి రూ. 80 లక్షలు కేటాయించి పనులు చేస్తున్నారు. కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు టౌన్ పంచాయతీ సహాయ డైరెక్టర్ జయకుమార్ పర్యవేక్షణలో టౌన్ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ అధ్యక్షతన బస్టాండ్‌పై రూపింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇనుప స్తూపాలు ఏర్పాటు చేసి పైకప్పు పనులు నిర్వహించనున్నట్లు అదికారులు పేర్కొన్నారు. మరో 20 రోజుల్లో బస్టాండు పనులు పూర్తి చేసి సేవలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

క్లుప్తంగా