
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
పళ్ళిపట్టు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్కేపేట మండల స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్కేపేటలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మండల మహానాడు శనివారం నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు గోవిందన్ అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీనివాసన్ స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్న మండల మహానాడులో ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని, పౌిష్టికాహార పధకం, అంగన్‌వాడీ సిబ్బంది రిటైర్డ్ వేతనంగా రూ.7,850 అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆర్కేపేటలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్క పరిష్కారంకు రింగ్‌రోడ్డు పథకం అమలు చేయాలని కోరారు. బస్ షెల్టర్, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించాలని తీర్మానం ఆమోదించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం శ్రేణులు వాసుదేవసింగ్,మణి, వినాయం, జయరామన్, ఇళంగోవన్, కేశవన్ సహా అనేక మంది పాల్గొన్నారు.