
ఆట్టి షూటింగ్ పూర్తి
తమిళసినిమా: ఇటీవల పరమశివన్ పాతిమ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాన్ని తెరెకెక్కించి ముఖ్య పాత్రను పోషించిన ఇసక్కి సరవణన్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆట్టి. దీనికి మెదకు చిత్రం ఫేమ్ కిట్లు దర్శకత్వం వహిస్తున్నారు. అయిలి వెబ్‌సిరీస్ ఫేమ్ నక్షత్ర నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు కాదల్ సుకుమార్, సౌందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యాధార్ధ సంఘటనల ఆధారంగా విప్లవ భావాలు కలిగిన ఐదుగురు సీ్త్రల ఇతి వృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం ఆట్టి అని చెప్పారు. ఇందులో ఇసక్కీ సరవణన్ పోలీస్‌అధికారిగా నటిస్తున్నట్లు చెప్పారు. తమ కులంలో మహిళలే యజమానురాళ్లు అనే ఇతి వృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. కుల దేవతల గురించి వివరించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను ఊటీ, కున్నూర్ ప్రాంతాలలో ఇప్పటి వరకూ సినిమా వాళ్లు కాలు మోపని ప్రదేశాలల్లోనూ, తూత్తుక్కుడిలోనూ నిర్వహించినట్లు చెప్పారు. షూటింగ్ పూర్తి అయ్యిందనీ, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికిక సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి దీశన్ సంగీతాన్ని, సిబీ సదానందాశివం ఛాయాగ్రహణం అందిస్తున్నారు.