క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 3 2025 5:24 AM | Updated on Jul 3 2025 5:24 AM

క్లుప

క్లుప్తంగా

245 మంది విద్యార్థులకు

రూ.1.31 కోట్ల స్కాలర్‌షిప్‌

వితరణ చేసిన జీఆర్‌టీ జ్యూవెల్లర్స్‌

కొరుక్కుపేట: సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా జిఆర్‌టి జ్యూవెల్లర్స్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 245 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ. 1.31 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందజేసింది. చైన్నెలోని జిఆర్‌టి మహాలక్ష్మీ విద్యాలయంలో ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జీఆర్‌టీ జ్యువెల్లర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిఆర్‌ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ మాట్లాడుతూ స్కాలర్‌షిప్‌లు ద్వారా లబ్ధిపొందించిన వారిలో అధిక భాగం ఆర్థికంగా వెనుకబడిన కుంటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నతంగా చదవాలని భవిష్యత్‌లో వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత అభివృద్దికై నా, సామాజిక మార్పునికై నా విద్యే పునాది అని విద్యను కొనసాగించాలనే సంకల్పంతో ముందుకెళ్లే విద్యార్థులకు జిఆర్‌టి జ్యువెల్లర్స్‌ మద్దతు ఇస్తున్నందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. మరో మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిఆర్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ విద్యకు మద్దతుగా స్కాలర్‌షిప్‌లను అందించడం తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో ప్రధాన భాగమని తెలిపారు. ఈ సంవత్సరం 245 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు.

వేధింపుల కేసులో

యువకుడి అరెస్టు

తిరుత్తణి: యువతికి లవ్‌ టార్చర్‌ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. అరక్కోణం ప్రాంతంకు చెందిన 21 ఏళ్ల యువతిని తిరువలంగాడు సమీపంలోని హరిచంద్రాపురం గ్రామానికి చెందిన ముహ్మద్‌ అలీ(21) అనే యువకుడు రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంగా యువతి సరిగ్గా పలకరించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం చిన్నమ్మపైట రైల్వే స్టేషన్‌ వద్ద వున్న యువతిని కలుసుకున్న ముహ్మద్‌ అలీ తనతో మాట్లాడాలని, ప్రేమించాలని టార్చర్‌ చేసినట్లు, యువతి తిరువలంగాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

ఆటో డ్రైవర్‌ల ఆందోళన

తిరువళ్లూరు: అక్రమ కేసులు బనాయించి పోలీసులు సీజ్‌ చేసిన ఆటోలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి ఆటో డ్రైవర్‌లు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఆటోలను పార్కింగ్‌ చేశారన్న నెపంతో 11 ఆటోలను సీజ్‌ చేసి వాటిని స్థానిక ఆర్టీవో కార్యాలయంలో అప్పగించారు. అయితే ఆటోలను సీజ్‌ చేయడం వల్ల తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం వుందని వాపోయిన డ్రైవర్‌లు బుధవారం రాత్రి 9 గంటలకు ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీవో రామకృష్ణన్‌, స్థానిక పోలీసులు ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్‌లతో చర్చలు జరిపారు. కొన్ని ఆటోలకు రూ. 500 నుంచి రూ. 3,500 రూపాయల వరకు జరిమానా విధించారు. మిగిలిన నాలుగు ఆటోలకు సరైన రికార్డులు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. కాగా ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆటో డ్రైవర్‌ల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

జిల్లాలోని పశువులన్నింటికీ

కోమారి టీకాలు తప్పనిసరి

వేలూరు: జిల్లాలోని పశువులకు, మేకలకు తప్పనిసరిగా కోమారి వ్యాధి టీకాలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్‌ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం నియోజక వర్గంలోని పీకే పురం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ది పథకాలను కలెక్టర్‌ తనఖీ చేశారు. అనంతరం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు కోమారి వ్యాధులు రాకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో పశు సంవర్థశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిరుకుమరన్‌, అసిస్టెంట్‌ అధికారి ఆందవన్‌, తహసీల్దార్‌ మురళీధరన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్లుప్తంగా1
1/2

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/2

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement