
సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని నిర్ణయం
తిరువళ్లూరు: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో బీమా సంస్థలకు చెందిన ఏజెంట్లు పాల్గొని, విజయవంతం చేయాచాలని నిర్ణయించినట్టు ఆ సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. బీమా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తిరువళ్లూరు, మీంజూరు, పొన్నేనొ, ఆవడి, పూందమల్లితో సహా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో సుమారు 10 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన చేపట్టనున్న సమ్మెలో బీమా సంస్థల ఏజెంట్లు పాల్గొనాలని ఆ సంఘం నేతలు వాసు, నాగలింగం, సెల్వకుమార్, రామకృష్ణన్ పిలుపునిచ్చారు.